ఈ మధ్య ఏరియల్ సర్ఫ్ యాడ్ ఒక దానికి ఫేస్ బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శాండ్ బర్గ్ ప్రశంసలు దక్కాయి. దినిని మోస్ట్ పవర్ ఫుల్ వీడియోగా ఆమే ప్రస్తుతించారు. తన ఫేస్ బుక్ పేజీలో షేర్ చేశారు కూడా.  ఈ యాడ్ లో కూతురి ఇంటికి వచ్చిన తండ్రి కూతురు చేసే పనులు చూస్తుంటాడు. ల్యాప్ టాప్ లో పని చేసుకుంటూ సోఫాలో వుంటాడు భర్త, ఈ అమ్మాయి ఫోన్ లో ఆఫీస్ పని చేస్తు ఇంట్లో పని చక్కబెడుతుంది. కాలంతో పోటీ పడుతూ బొంగరంలా తిరుగుతూ పనులు చేస్తున్న కూతురుని చూస్తే తనూ ఇంతే కదా , ఏనాడు భార్యకు సాయపడలేదు కదా అనే ఆలోచనలో తన ఇంటికి వెళ్లగానే మొదటిసారిగా వాషింగ్ మెషిన్ లో బట్టలు వేసేందుకు వెళతాడు. దానికి భార్య సాయపడుతుంది ఇది యాడ్. చాలా బావుంది కదా. లాండ్రీ ఓన్లీ ఏ మదర్స్ జాబ్ ఇది ట్యాగ్.

Leave a comment