మధ్యాహ్నం వుపహరానికి, మద్యాహ్నం భోజనానికి నడుమ, చిరు తిండికి ప్రత్యామ్నాయంగా నట్స్ తీసుకుంటే ఆరోగ్యం అంటున్నారు డాక్టర్స్. ఓట్స్ క్వినోవా వంటి వాటికి నట్స్ జత చేస్తే ఆరోగ్యం, రుచి కుడా . గర్భం దాల్చాలని భావిస్తున్నప్పుడు బాదం పప్పులు  బెల్లం తింటే పోషక ప్రయోజనాలు దక్కుతాయి. డిజర్ట్స్ లో  చక్కర బదులు నట్స్ కలుపుకుంటే తీపి రుచి ఇస్తాయి. పాల ఉత్పత్తులలో నట్స్ కలిపి ఉదయాన్నే లేదా రాత్రి పడుకునే ముందు తిన్నా రోజంతటికీ బాలింతకు శక్తి వస్తుంది. రాత్రి మంచి నిద్ర కుడా పడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా దొరికే నట్స్ రోగ నిరోధక వ్యవస్ధకు ప్రయోజన కారమైనవి. గుండెకు ప్రయోజన కరమైన కొవ్వు వీటిలో దొరుకుతుంది. డ్రై ఫ్రుఇత్స్, నట్స్ రెండు ఒకటి కావు. నట్స్ లోపలి గింజలు, డ్రై ఫ్రుఇత్స్ ని నిలువపెట్టేందుకు ఎండ బెట్టి తయారు చేస్తారు.

Leave a comment