ఫేస్ బుక్ లో కనెక్ట్ అయి వున్నారూ అంటే మన గురించిన సగం వివరాలు మనం ఇచ్చుకున్నట్లే. ఫోటోలు, ఫోతోల్లోని మన ఇళ్ళు, మనం పెట్టే పోస్టుల్లో విషయాలు. మన అడ్రస్లు సర్వం మనం వాల్ పైన పెడుతున్నాం. ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు పోస్ట్ చేస్తూనే జియో టాగింగ్ లో మనం ఎక్కడ వున్నామో తెలిసిపోతుంది. అలాంటప్పుడు పొరపాటున కుడా మన అడ్రస్సు అస్సలు పోస్ట్ చేయద్దు. పెళ్ళిళ్ళు, విహార యాత్రలకు వెళుతూ నిమిషా నిమిషం ఎక్కడున్నామో ఇప్పుడు చెప్పద్దు. సోషల్ మీడియా సైట్స్ అడిగిన వివరాలన్నీ, వ్యక్తిగాతమైన వైతే అస్సలు ఇవ్వద్దు. ఇక ప్రైవైట్ ఫోటోలు, అరకొర దుస్తులతో దిగిన ఫోటోలు ఏకాంతానికి సంబందించిన వివరాలు అస్సలు ఫోన్ లోనే వుంచొద్దు. మన ఫోన్ లో వున్న ఫోటోలు ఫేస్ బుక్ లో కితనే లాగొచ్చు. ఫేస్ బుక్ లో గోప్యత అన్న పదానికి అవసకాసం లేదు. సరదాగా మన గురించి ప్రతి అంశాన్ని పోస్ట్ చేస్తూ పొతే హాకర్ల తాళాలు ఇచ్చినట్టే.
Categories