నీహారికా,

చాలా మంది జీవితం విషయంలో చాలా నిర్లప్తంగా ఉంటారు. దాని మర్గాన అది సజావుగా సాగి పోతుందని సారి పెట్టుకొంటూ వుంటారు. కానీ ఎంత కాలం అలా మనస్సు చంపుకోవడం. వ్యక్తిగతంగా ఎదుగుదల కోరుకునే వ్యక్తులు అలా వుండటం సాధ్యమా? టార్గెట్స్ అవతల పెట్టి కోరికలు చంపుకుని ఇలా కాలక్షేపం చేస్తున్నామని అసంతృప్తి పీడిస్తూనే వుంటుంది. ఆ అసంతృప్తి అన్ని అనారోగ్యాలకు మూలం అవ్వుతుంది కదా. సౌకర్యంగా వున్నాం కదా ఇందులోంచి బయటకి వస్తే. ఏదైనా రిస్క్ అవ్వుతుందేమోనని గిరిగీసుకు కూర్చుంటే లోపలుండే ఉత్సాహం ఊరుకుంటుందా? ఎలాగైనా వెలుపలికి రావాల్సిందే. మన చుట్టూ మనం కట్టుకున్న గుడు చేధించుకుని బయటకు రాలేకపోతే అవకాశాలు ఎలా వస్తాయి. ఎదుగుదల ఎలా సాధ్యం అవ్వుతుంది. లైఫ్ ఎప్పుడు ఏ సమయంలోనూ పర్ఫెక్ట్ గా అమర్చి కనబడదు. మనం ఎగుడు దిగుళ్ళని సారి చూసుకుంటూ విశాలమైన మైదానాలని నిర్మించాలి. ఆ మైదానాల్లో మనకిష్టమైన సౌధాల్ని కట్టుకోవాలి. అప్పుడే తృప్తి జీవన సాఫల్యం కూడా.

Leave a comment