Categories
సన్ ఫ్లవర్ ఆయిల్ వాడుకోంటాం సరే పొద్దు తిరుగుడు గింజలు ఎందుకు మర్చి పోతుంటారు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఇది ఎంతో మంచి పోషకాహారం. ఈ గింజల్లో విటమిన్-ఇ, ధైమిన్, కాపర్, ఫాస్పరస్, సెలీనియం వంటి అరుదైన విటమిన్లు, ఖనిజాలు, ఫ్యాటీ ఆమ్లాలు, పీచు, బి-విటమిన్, ఫైటో సెరల్స్ కుడా ఉంటాయి. ఈ గిన్జల్లోని మెగ్నీషియం, బి.పి ని నియంత్రిస్తుంది చర్మ ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. సిరోజాల పెరుగుదలకు తోడ్పడతాయి. వీటిని సలాడ్లు, కూరలు, బ్రెడ్డు, కేకుల్లో చల్లుకోవడం లేదా స్నాక్స్ గా తిన్నా మంచిదే. పొద్దు తిరుగుడు గింజలు ఆక్సీకరణ వత్తిడిని తగ్గించడం ద్వారా హానికర ప్రీ రాడికల్స్ విడుదలను అడ్డుకుంటాయి.