Categories
![ఈ ఏడాది వరస హిట్స్ అన్నీ కాజల్ వే. అగ్ర కథానాయక అనిపించుకోవటం అంత ఈజీ ఏం కాదు. అందం అభినయం అదృష్టం అన్నీ కలిసి రావాలి. స్టార్ హీరోల తో పాటు పోటీగా నటించగలగాలి. కధానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు న్యాయం చేయాలి. కాజల్ కి ఈ లక్షణాలన్నీ వున్నాయి. కనుకనే చిరంజీవి ఖైదీ నెంబర్ 150 లో నటించగలిగింది. ఎంతో మంది వడపోత తర్వాతే కాజల్ ని ఎంచుకున్నారు. క్రిస్మస్ కి రిలీజ్ చేసిన ఒక పాత సన్నజాజిలా పుట్టేసిందిరో అంటూ చిరంజీవి కాజల్ ని వర్ణిస్తూ పాడిన పాట ఫాన్స్ ఫిదా అయ్యారు. ఏడేళ్లుగా నటిస్తున్న నేను నా కెరీర్ చివరిదశకు వచ్చిందనుకోను. ప్రతి సినిమా నా తోలి సినిమా లాగే భావిస్తాను.చేతిలో ఎన్ని విజయాలున్నా అశ్రద్దగా ఉండను. అంటూ వినయంగా చెప్పగలిగింది. కనుకే ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ సినిమాల్లోకొస్తున్న చిరంజీవి సినిమాలో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకోగలిగిందామె. ఈ చిత్రంలో పాటలన్నీ విన్నారా ?](https://vanithavani.com/wp-content/uploads/2016/12/kajal.jpg)
నా కోసం దర్శకులు ఫలానా పాత్ర సృస్టించాము అంటే ఎంత బావుంటుంది. ఈ ఆనందాన్ని నేను కొన్నేళ్ళుగా అనుభవిస్తున్నానంటోంది కాజల్ అగర్వాల్. నేను కోరుకుంటే ఏ పాత్ర నా దగ్గరకు రాలేదు. న్యాయం చేయగలననే ధైర్యం తోనే దర్శకులు నన్ను సంప్రదిస్తారు అంటోంది కాజల్. సినిమాల ఎంపికలో ఒక్కో సారి ఒక్కో విషయానికి ప్రాధాన్యత ఇస్తాము. ఈ మధ్య కాలంలో పాత్రలు నన్ను ప్రభావితం చేస్తున్నాయి. ఆమంచి పాత్ర అని నాకు అనిపించినప్పుడు మిగతా విషయాలు ఏమీ పట్టించుకోకుండా సినిమా చేయాలనిపిస్తుంది. అలా విభిన్నమైన పాత్రలను చేయగలుగుతున్నాను. గతం తో పోలిస్తే నా సినీ ప్రయాణం మూడేళ్ళుగా మరింత సంతృప్తిగా సాగుతుంది అంటోంది కాజల్.