Categories

పని తో అలసిపోయి మధ్యాహ్నం వేల పది నిమిషాలు కునుకు తీస్తే సరే కానీ వృద్దులు మాత్రం పగటి నిద్ర తో తూగుతూ వుంటే వెంటనే డాక్టర్లను కలవండి అని చెప్పుతున్నాయి పరిశోధనలు. సాధారణంగా భోజనం తర్వాత ఓ అరగంట పాటు నిద్ర పోయినా పెద్ద తప్పేం కాదు. అసల్ ఆరోగ్యం కుడా, కానీ వృద్దుల విషయంలో మాత్రం, అదీ 49 శాతం మంది లో ఈ పగటి నిద్ర మత్తు గనుక కనిపిస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. సుమారు వెయ్యి మంది వృద్దుల మీద దీర్ఘకాలం పరిశోధన చేసి ఈ విషయం గురించి నిర్ధారణ కు వచ్చామని, ఈ లక్షణాలుంటే మాత్రం వైద్యులను సంప్రదించమంటున్నారు.