నీహారికా,

పిల్లల భావోద్వేగాలకు, వాళ్ళు బరువు పెరగటానికి సంబంధం వుందని ఇవ్వాళ ఒక రిపోర్టు వచ్చింది. ఈ అద్యాయినం ప్రకారం, తల్లి దండ్రుల నుంచి ఏదైనా ప్రతికూల మైన వ్యాఖ్యానం వింటే పిల్లలు చాలా కుంగిపోతారట. ఇంట్లో పెద్దల ఆంక్షలు నియంత్రణలు ఎక్కువైతే వాళ్ళు తమ దృష్టిని ఆ వైపు నుంచి మళ్ళించేందుకు ఎక్కువ తినేస్తారట, పిల్లల ప్రవర్తన పైన, చదువు సంధ్యల పైన పెద్ద వాళ్ళు మరీ ఎక్కువ ద్రుష్టి పెట్టి వాళ్ళను వెంటాడితే, వాళ్ళకు మరో దారి లేక వత్తిడి తట్టుకోలేక ఎదో ఒక్కటి తినేస్తారు. అప్పుడు బరువు పెరుగుతారు. పెద్ద వాళ్ళు వాళ్ళ బరువు పైన దృష్టి పెట్టి హద్దులు విధిస్తారు. దీన్ని భరించలేక పిల్లలు డిప్రెషన్ లోకి వెళ్ళడం, తల్లి దండ్రుల వైఖరి పట్ల వ్యతిరేకత తో వుండటం, వాళ్ళ పైన ఇరగాబాడటం చేస్తారట. చూశారా ఇది ఎలా గుండ్రంగా తిరుగుతూ పిల్లలు, తల్లి దండ్రుల మధ్య దూరం పెంచుతుందో?

Leave a comment