Categories
నీహారికా,
మన కంటూ కలలుంటే అవి సాకారం అయ్యేందుకు మన చుట్టూ వున్న ప్రపంచం అన్ని విధాలా సాయం చేస్తుందని చెప్పచ్చు. అయితే ఒక్కటి, కలనిజం చేసుకునేందుకు మనం కష్టపడాలి. అయితే చిక్కు ఎక్కడ వస్తుందంటే చాలా మంది కళలు కంటారు. వీటిని సాకారం చేసుకునేందుకు పట్టే సమయాన్ని భరిచలేక మధ్యలోనే వదిలేస్తారు. ఒక గినాజ మొలకై, మొక్కయి, మాను అయ్యేందుకు చాలా కాలం పడుతుంది. ముందుగా ఎవరికీ వాళ్ళు వుండే అంతులేని సంపదలు గుర్తించి తవ్వి తీయాలి. డబ్బు ఒక్కటే సంపద కాదు. మనిషిలో వుండే ఆశావాదం, ఓర్పు, నేర్పు, దేన్నయినా సాధించాలానే కోరిక, అందు కోసం ఎంత కష్టానికైనా ఓర్చే గుణం ఇవన్నీ మనిషిలో వుండే సంపదలు. ఈ సంపదలను నమ్ముకుని ఏ చిన్న పని మొదలు పెట్టినా చాలా తొందరగా వృద్ది లోకి రావచ్చు.