Categories
కీరదోస రసంలో కొన్ని పాలు కలిపితే అది మంచి క్లెన్సర్ లాగా పని చేస్తుంది. కీరదోస ఫేస్ మాస్క్ తో చర్మం పొడి బారకుండా వుంటుంది. రెడ్ మీట్, కీరదోస గుజ్జు కొన్ని పాలు కలిపి ఆ మిశ్రమాన్ని మొహం , మెడకు అప్లయ్ చేసి ఓ అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేయాలి. వీటితో చర్మానికి తేమను అందించి పోషణ ఇచ్చే పదార్దాలున్నాయి. యాస్ట్రింజెంట్ ధర్మాలున్నాయి. చర్మం పైన ఆమ్లపు పూత తగ్గిపోతే దాన్ని చర్మానికి చేర్చే శక్తి కీరదోసలో వుంది. చర్మం పైన బాక్టీరియా చేరకుండా అడ్డుకుంటుంది. చర్మానికి పోషణ ఇస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు వుండవు కనుక ప్రతి రోజు ఫేస్ ప్యాక్ వేసుకున్నా నష్టం లేదు.