Categories
శరీరాన్ని ఫిట్ గా ఉంచడం మన చేతుల్లో ఉంటుంది అంటారు ఎక్స్ పర్ట్స్. మజిల్స్ బలంగా వుండి గంటల తరబడి పనిచేసే శక్తి రావాలంటే శరీరానికి వ్యాయామం కావాలి. అదీ ఎలాంటిది? ఇంట్లో ఉన్నా ఆఫీసులో వున్నా , నిలబడి ఉండటం ప్రాక్టీస్ చేయాలి. గంట సేపు నిలబడే ఉంటే యాభై కేలరీలు ఖర్చు అవ్వుతాయిట. మనం తినే విధానం లో మార్పులు రావాలి. కాస్త నెమ్మదిగా తినాలి. అలా తినే కాస్త అరగంట సేపు నమిలి తినాలి. అలా నమిలి తింటే తక్కువ కాలరీలు పొట్టలోకి వెళతాయి. నడక పరుగు తీయడం కుదరకపోతే స్ట్రెచ్చింగ్ చాలు. ఇంట్లో వున్నా సరే శరీరానికి శక్తి అందినట్లే.