Categories
కొన్ని అధ్యయనాలు కొత్త ఊపుని హుషారుని ఇస్తాయి. టూరిజం కంపెనీ ట్రాప్ కార్డ్ చేసిన అధ్యయనంలో సెల్ఫ్ డ్రైవింగ్ ను ఎంజాయ్ చేసే వాళ్ళల్లో ఇండియా లో పురుషులతో పోలిస్తే స్త్రీల సంఖ్య చాలా ఎక్కువ ఉందిట. పురుషులు 40 శాతం కాగా ఆవాళ్ళు 60 శాతం మంది. సెల్ఫ్ డ్రైవింగ్ తో టూర్స్ చేస్తున్నారట. ఇలాంటి టూర్స్ కు విదేశాల్లో ఆధరణ ఎక్కువట. తీరుబాటుగా ఇష్టమైన చోట్లకు వెళ్ళి , వివిధ ప్రదేశాల్లో అన్ని వింతలు , విశేషాలు చూసి మనస్సుకు నచ్చినట్లు వుండే అవకాశం ఉండటం తో స్త్రీ లు పురుషులు తేడా లేకుండా హాయిగా కార్ల పైన లాంగ్ డ్రైవ్ కు వేకుతున్నారు. ఇప్పుడు మన దేశంలో ఈ అలవాటు పెరుగుతుంది. తీర్ధ యాత్రలు సహస యాత్రలు చేసే వారి సంఖ్య ఎక్కువైంది. వాళ్లలో స్త్రీల శాతం ఎక్కువ అయ్యింది.