నీహారికా,
ఒక్కతమాషా రిపోర్టు వచ్చింది. మనందరం ఇతరుల్ని బ్లాక్ మెయిల్ చేస్తామట తెలుసా. ఎలాగంటే మనం చెప్పిన మాట వినకపోతే మనం చిర చిర లాడి పోతాం పిల్లలకు తెలుస్తుంది. మనల్ని సంతోషంగా చూడాలి అనుకుంటే చెప్పిన పని చేయాలని వాళ్ళకి అర్ధం అవ్వుతుంది. అలాగే బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళలో తల్లిదండ్రులు , అక్కచెల్లెళ్ళు , అన్నదమ్ములు , స్నేహితులు భార్యా భర్తలు కావొచ్చు. ఇలాంటి దగ్గర అనుబంధాల నుంచి వచ్చే బ్లాక్ మెయిలింగ్ ఆపడం చాలా కష్టం. మన అనుబంధం , ఆప్యాత , అభిమానం , భద్రతా , గౌరవం పోగొట్టుకుంటామేమో నన్న భయం తో ఈ బ్లాక్ మెయిలింగ్ భరిస్తాం. ఈ భయం వదిలేసేంత విసిగింపులు అనిభావించాక అప్పుడు భయపడతాం. ఇవన్నీ మనకెదురయ్యే వత్తిడిలు . బయట పడాలంటే ఎన్నో వ్యతిరేకతలు ఎదుర్కొని మన నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాలి.