వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ ,ముడి ధాన్యాలు ,చిరుధాన్యాలతో చేసిన బ్రెడ్ ల వాడకం మనకు తెలిసిందే. ఇప్పుడు బ్రెడ్ లో విటమిన్లు, ఖనిజాలు ,యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉండేలా రంగుల కాయగూరలను ,పండ్లనీ జోడించి తయారు చేస్తున్నారు సింగపూర్ కు చెందిన నేషనల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు .నల్ల ద్రాక్ష, నల్ల బియ్యం ,బ్లూ బెర్రీలు,వంగరంగు చిలకడ దుంపలు,ఊదరాంగు కాలీఫ్లవర్లు కలిపి వాటి నుంచి కలర్ ఆంథోసైనిన్లను వెలికి తీసి వాటితో కలర్ బ్రెడ్ తయారు చేశారు. ఇది చక్కెర వ్యాధిని ,ఊబకాయాన్ని అరికడుతోంది. ఇక ఈ వెజిటెబుల్ బీర్ల తయారీలోకి క్యారెట్ ,బీట్ రూట్, చిలకడదుంప,పాలకురా,కాలీఫ్లవర్ ,గుమ్మడి ,ఫైనాఫిల్,అరటి పండ్లు మొదలైనవి వచ్చి చేరుతున్నాయి. పీచుతో పాటు ప్రోటీన్లు ఉండేందుకు వీటిలో నట్స్ కలుపుతున్నారు.