స్త్రీ, పురుషుల్లో ఆసక్తుల గురించి చేసిన సర్వేలో ఒక చిత్రమైన విషయం తెలిసింది. ఒక అమెరికా సంస్థ చేసిన సర్వేలో స్త్రీలకు షాపింగ్ లో ఉండే ఓపిక ఇంకో విషయంలో ఉండదు, అదే పురుషులు క్రీడల పై చూపిన ఆసక్తి షాపింగ్ పైన చూపించరు. పైగా షాప్ లో అడుగుపెట్టిన 29 నిమిషాల్లో ఏం కొనాలో నిర్ణయించుకుంటారని తేలింది. క్వాలిటీ చూస్తారు కాని కలర్స్ చూడరు. పైగా రెండో సారి వచ్చి చూద్దాం అనుకోకుండా ఆ పనిని ఒక్కసారే పూర్తి చేస్తారు. అయితే స్త్రీల విషయంలో అది రివర్స్ వాళ్ళకు బాధ్యత ఎక్కువ. ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళ కోసం షాపింగ్ చేయాలి. అందరి అవసరాలు తీర్చేది వాళ్ళే ఒక వస్తువు చేతిలోకి తీసుకుని అది కుటుంబానికి ఎంతవరకు అవసరమో పది సార్లు ఆలోచిస్తారు. ఇంట్లో అందరి కోసం షాపింగ్ చేయటం పురుషుల్లో అరుదేనట.
Categories