Categories
ప్రముఖ సంఘ సంస్కర్త , స్వాతంత్ర సమరయోధురాలు రచయత్రి దుర్గబాయ్ దేశ్ ముఖ్ 1909 జులై 15 వ తేదీన రాజమండ్రిలో జన్మించారు. హిందీ పాండిత్యా న్ని సంపాదించి హిందీ పాఠశాలను నెలకొల్పి విద్యా బోధన అందించారు. 1942 లో ఎల్ ఎల్ బీ పూర్తి చేశారు. ఆమె స్థాపించిన ఆస్పత్రులు , కాలేజ్ లు ఈనాటికి స్త్రీల అభ్యున్నతి కోసం పని చేస్తున్నాయి. దుర్గబాయ్ దేశ్ ముఖ్ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. న్యాయ కోవిదురాలిగా ప్రముఖ క్రిమినల్ లాయార్ గా పని చేశారు. 1975 లో పద్మ విభూషణ్ తో ప్రభుత్వం ఆమెను గౌరవించింది.