థాయ్ లాండ్  లో జరిగిన 14 వ ఏషియన్ వాలీబాల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనడం నాలో ఆత్మవిశ్వసం పెంచింది.మేము గెలిచింది ఒక మ్యాచ్ లో అయినా వివిధ జట్ల క్రీడాకారిణుల ఆటను దగ్గర నుంచి చూడటం నాకు ఉత్సాహాన్ని స్ఫూర్తిని ఇచ్చింది. జాతీయ స్థాయి సీనియర్స్ జట్టుకు ఎంపిక కావటం,ఐ పి ఎస్ సాధించటం నా ఆశయం అంటోంది శాంతకుమారి. ఉమ్మడి పాలమూరు వనపర్తి జిల్లా చిట్యాల మండలం తూర్పు తాండ కు చెందిన క్రీడా ఆణిముత్యం శాంతకుమారి ఎస్సెస్సీ సప్లిమెంటరీ ప్రిపేర్ అవుతోంది జాతీయ స్థాయి ఎంపికలో మన దేశం తరఫున అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నది. శాంతకుమారి గిరిజన తండాల్లో పుట్టిన ఈ యువతి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది.

Leave a comment