Categories
పెర్ల్ సెడెన్‌స్ట్రికర్ బక్ నోబెల్ బహుమతి పొందిన తొలి అమెరికన్ రచయిత్రి. 1931 లో వెలుగుచూసిన ‘గుడ్ ఎర్త్’ తో ఆమె అమెరికన్ సాహిత్యంలో అగ్ర శ్రేణి రచయిత్రిగా స్థానం సంపాదించుకుంది. ఈ నవలను ఎం.జి.ఎం స్టూడియో వాళ్ళు సినిమా తీశారు. ఈమె రచనలనన్నింటిలో ఎక్కువగా చైనీస్ జీవితము ముఖ్యంగా గ్రామీణ జీవితాన్నే ప్రతిబింబిస్తుంది. పెర్ల్ తన తల్లి దండ్రుల గురించి రాసిన ‘ది ఎక్స్పైల్’ , ‘ది పైటింగ్ ఏంజిల్’ చైనా గ్రామీణ జీవితాన్నీ దర్శింపజేస్తాయి. ఆర్కే నారాయణ్ నవల గైడ్ సినిమాగా తీసినప్పుడు దేవానంద్ కు దాని ఇంగ్లీష్ వెర్షన్ నిర్మాణానికి ఆర్థిక సహాయం చేశారామే. ఈమె రాసిన అద్భుతమైన నవలలు తప్పని సరిగా చదవాలి. తెలుగులోకి అనువాదం కూడా వచ్చాయి.