Categories

ముఖంపైన జిడ్డు పోయేందుకు స్క్రబ్బింగ్ చేస్తారు. కానీ ఈ కాలంలో బయట దొరికే స్క్రబ్బర్స్ వద్దు . చెమటతో తడిసి మాటిమాటికీ తుడిచి పొడిగా అయిన చర్మం కోసం ఇంట్లోనే మంచి స్క్రబ్బర్ తయారు చేయవచ్చు. అరటి పండు గుజ్జు ,ఓట్స్ తేనె కలిపి మొహానికి రాసుకుంటే ఎండవేడికి కమిలిన ముఖం కాస్తా తేటగా అయిపోతుంది. పాలు,తేనె కొబ్బరి నూనె వంటి తేలికైన సహాజమైన మాయిశ్చరైజర్లు ,రసాయనాలతో కూడిన మాయిశ్చరైజర్ ల కంటే ఇవి 90 శాతం బాగా పని చేస్తాయి.