కేవలం ఖరీదైన క్రీములు, సౌందర్య చికిత్సల వల్లనే చర్మం తాజాగా మెరుస్తుందనుకుంటే పొరపాటే. పోషకాలతో కూడిన మంచి ఆహారం చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. బాధం పప్పులో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ అతినీల లోహిత కిరణాల నుంచి చర్మకణాలకు రక్షణ ఇస్తాయి. ప్రతి రోజు గుప్పెడు పప్పులు తినాలి. అలాగే కేరట్ లోని పోషకాలు చర్మపు పై పొరలో అవసరానికి మించి కణాలు పెరగకుండా నియంత్రిస్తాయి. గ్రీన్ టీ ఆకులు మరిగే సమయంలో విడుదలయ్యే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మానికి పోషకాలు ఇస్తాయి. టమోటాలు కూడా అతినీలలోహిత కిరణాలల్లో ప్రీ రాడికల్స్ నుంచి చర్మానికి రక్షణ ఇస్తాయి. చర్మం అందంగా మెరిసిపోతూ ఉండాలంటే ఈ పోషకాలే ఆధారం.

Leave a comment