Categories
అవిసె గింజలు ఆరోగ్యానికి మంచిదని ఎప్పటినుంచో తెలుసుకానీ ఈ గింజల్లో ఉండే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాల కారణంగా చర్మం అందంగా మెరిసిపోతుంది. వయసుతో వచ్చే ముడతలు కూడా తగ్గుతాయి. అవిసె గింజల్లో నీళ్ళుపోసి మెత్తగా గ్రైండర్ చేసి మొహాం,మెడకి ఫ్యాక్ వేయాలి. అది ఆరిపొయాక పైన ఇంకా ఫ్యాక్ వేయాలి .ఇలా నాలుగైదు విడతలుగా ఫ్యాక్ వేసి వేడి నీళ్ళతో కడిగేస్తే ముఖం కాంతిగా మెరుస్తుంది. అలాగే ఈ అవిసె గింజల పొడిలో నిమ్మ రసం ,తేనే కలిపి పూతగా వేసిన చర్మం మృదువుగా అయిపోతుంది. అలాగే పెరుగు గంధం కలిపినా ముఖం చక్కగా మెరుపుతో ఉంటుంది.