క్లీనింగ్ కోసం మనం వంటగదిలో ఉపయోగించే గుడ్డలు, స్పాంజీల్లో 300 కు పైగా సూక్ష్మజీవులు చేరతాయని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. వీటిలో ఎక్కువ ప్రమాదకరమైంది బ్యాక్టీరియానే. ఇల్లంతటిలో బ్యాక్టీరియా వ్యాపించే చోటు వంటిల్లే కూరగాయలు,పండ్లు, మాంసం ఇతర దినుసులు వస్తువులు ఆహారపదార్ధాలు అన్నింటిలో ఏదోరకమైన సూక్ష్మజీవులు ఉంటూనే ఉంటాయి. ఇవి ప్యాక్ చేసే వస్తువుల్లో వాటికి ఉపయోగించే నీళ్ళు అన్నింటిలో బ్యాక్టీరియా ఉంటుంది. వాటిని తుడిచి శుభ్రం చేసిన వంట గది గూళ్ళు, గోడలు తుడిచే స్పాంజ్, గుడ్డల్లో ఇవన్ని చేరిపోతాయి. ప్రతిరోజు వేడినీళ్ళలో ఉతికి ఎండలో ఆరేసిన కొంత తగ్గుతాయి. కాని వాటిలో సూక్ష్మజీవులు అతి వేగంగా పెరుగుతుంటాయి. కనుక క్లీనింగ్ కు ఉపయోగించేవన్ని వారం రోజులు మించి వాడకూడదు.
Categories