Categories
Gagana

అరవై ఏళ్ళ హీరో పర్లేదా

హీరోయిన్లకు ముప్పైఏళ్ళు దాటితే అవకాశాలు ఇక రావు కదా. మీరు దీన్ని గురించి ఆలోచించలేదా అని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు శృతిహాసన్ వయసు అనేది కొంతమందికి మాత్రమే పనికొచ్చే అంశం. అందుకే దాన్ని ప్రచారం చేస్తారు. నలభై ఏళ్ళు వచ్చిన హీరో పుస్తకాలు పట్టుకుని కాలేజీకి వెళ్ళే పాత్రల్లో నటిస్తుంటే మూడుపదులు దాటిన హీరోయిన్ పనికిరానట్లేనా. యాభైలు, అరవైలు వస్తున్నా సినిమాలో హీరోలుగా చేస్తున్నారు. ప్రేక్షకులు వయసు గురించి ఆలోచిస్తారు అనుకోను. వాళ్ళు బాగా చేశారా లేదా అనే ఆలోచిస్తారు. ఒకవేళ బాగా చేయకపోతే 20 ఏళ్ళ హీరో హీరోయిన్లకు కూడా ప్రేక్షకులు మోహమాటం లేకుండా తిరస్కరిస్తారు అంటుంది. కమల్ హాసన్ కూతురి సమాధానం ఇంతకంటే వేరుగా వుంటుందా.

Leave a comment