క్యాబేజీని ప్రపంచం మొత్తం వాడతారు. మెడిటేర్నియన్  కోస్ట్ కు చెందిన క్యాబేజీ ఏడాది మొత్తం దొరికినా ఈ శీతాకాలంలో ఎక్కువగా ఎదిగే పంట ఇది. పచ్చిగా సలాడ్స్ తో దీన్ని తినచ్చు. విభిన్న ప్రాంతాల్లో విభిన్న రంగుల్లో  లభిస్తుంది క్యాబేజీ. ఇందులో ఫిట్ న్యూట్రియాంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా దొరుకుతాయి. అన్ని రకాల థెరప్టిక్ డైట్స్ లో తప్పనిసరిగా ఉండాల్సినది. క్యాలరీలో చాలా తక్కువ. ఫ్యాట్ కూడా నామ మాత్రం . వంద గ్రాముల క్యాబేజీ లో 27 క్యాలరీల 0.1 గ్రాముల కొవ్వు ఉంటాయి. చైనీస్ క్యాబేజీని సలాడ్స్ లో వాడతారు. బరువు తగ్గాలనుకునేవారికి ఇది సరైన ఛాయిస్. వీటిలో ఉన్న పోషకాల దృష్ట్యా బాగా ఉపయోగపడుతుంది. బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రిస్తుంది. పీచు చాలా ఎక్కువగా వుంటుంది. కనుక కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇందులో లభించే విటమిన్ కె గర్భవతులకు పుట్టిన పసిబిడ్డలకు చాలా ముఖ్యమైనవి.

Leave a comment