ఫ్యాషన్ ప్రపంచంలో ఇప్పుడు బంగారం ఒక్క అడుగు వెనక్కి ఉన్నాట్లు అప్పుడెప్పుడో సన్నటి గొలుసు చేతికి వాచీ అని నవలా నాయికలను వర్ణిస్తున్నారు. ఇప్పుడైతే ఆ రోజులు వెనక్కిపోయి డ్రెస్ కి జ్యూవెలరీ మ్యాచ్ అయితేనే ఫ్యాషన్ అన్న రోజులు వచ్చాయి. కాబట్టి ఫంకీ జ్యూవెలరీ మార్కెట్లో కొత్తగా మెరుస్తూ అమ్మాయిలను ఆకర్షిస్తూ ఉంటుంది. ఆలా తళుకు లీనుతూ అందంగా కనిపించే మురానో  గ్లాస్ పెండెంట్స్ ఇటలీలోని వెనిస్ ఓ ప్రత్యేక మైన పద్దతి లో తయారు చేసే ఈ గ్లాసు లాకెట్లు యూత్ కి తెగనచ్చేసాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిలందరూ ఇష్టపడే పెండెంట్స్. తమ ఇష్టాన్ని బట్టి ఇవి నైలాన్ కాటన్ మెటల్ చేయిస్తూ లేదా తాళ్లకు తగిలించుకొని వేసేసుకుంటున్నారు. ఒక సూర్య కిరణమో రాత్రివేళ లైటు వెలుగు పడితే ఇవి వర్ణాలతో జిగేల్ మంటున్నాయి.

Leave a comment