Categories
ఆడవాళ్ళలో ఎక్కువగా పొట్టలో కొవ్వు పేరుకు పోవడానికి కారణం వాళ్ళ నడుము పెద్దదిగా వుండటం. దీనితో సహజంగానే ఆడవాళ్ళలో ఎక్కువ కార్టిసోల్ ఉత్పత్తి అవ్వుతుంది. ఒత్తిడి వల్ల ఆడ్రినల్ గ్లాండ్స్ కార్టిసాల్ ను అధిక స్ధాయిలో ఉత్పత్తి చేస్తే దీని వల్ల పొట్టలో కొవ్వు బాగా ఎక్కువ అవ్వుతుంది. ఇలా పొట్ట దగ్గర పేరుకు పోయిన కొవ్వును ఆరోగ్యకరమైన రీతిలో తగ్గించుకోవాలి. పొట్ట తగ్గేందుకు బాగా నడవాలి. ఆహారం పరిమితంగానే తినాలి. ఆహారం తినేటప్పుడు ఏ పని పెట్టుకోకుండా ఏకాగ్రత తో తినాలి. అప్పుడే ఏ పదార్ధంఎంత తింటున్నామో అర్ధం అవ్వుతుంది. కండలు బలంగా వుండేందుకు చేసే వెయిట్ ట్రైనింగ్ వల్ల పొట్టలో పేరుకున్న కొవ్వు తగ్గుతుంది.