నాకు నచ్చిందే చేయాలని నేనెప్పుడు అనుకోలేదు. నేనెంతో ఎదగాలి అదోక్కటే ఎప్పుడు నా మనసులో ఉండేది. అప్పుడు నాకు తెలిసింది ఎంత? నా విలువ ఎంత అని ప్రశ్న వేసుకొన్నాను. ప్రతి వాళ్ళు తన ప్రతిభను అంచనా వేసుకోవటం అవసరమేనని నాకు అనిపిస్తుంది అంటోంది రుకుల్ ప్రీత్ సింగ్ .నేను నా శక్తి అంచనా వేసుకొన్నాకా నా సినిమాల్లో ఎక్కువ భాగం డైరెక్టర్ కు వదిలేస్తూ వచ్చాను . వాళ్లు సృష్టించుకున్న పాత్రల గురించి వాళ్ళకు చక్కని అంచనా ఉంటుంది. నేనా పాత్రలో ఇమిడి పోవాలని మాత్రం అనుకొన్న అంతే చేస్తాను కూడా . కథ ఏమిటి ? నాతో పాటు ఈ సినిమాలో ప్రయాణం చేసేది ఎవరు అన్న విషయాలు తెలుసుకొని సంతృప్తి కలిగితే ఇక నేను రెండో విషయం పట్టించుకోను అంటోంది రకుల్. నా పాత్ర నేను ఖచ్చితంగా నిర్వర్తించానంటోందామే.
Categories