వ్యాయామలు చేసే స్త్రీలు తప్పని సరిగా ప్రోటెక్టివ్ సపోర్ట్ బ్రా వేసుకోమని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్ .లేకపోతే ఛాతీ నొప్పితో బాధపడవలసి వస్తుంది అంటున్నారు . సపోర్ట్ లేనప్పుడు స్తనాలు తొమ్మిది సెంటీమీటర్లు బౌన్సప్ అవుతాయి. చాలా మంది ప్రెటెక్టివ్ సపోర్టు బ్రా వేసుకోరు వ్యాయామాల సమయంలో తప్పని సరిగా వేసుకొని ,ఓ నలభై వాష్ ల తర్వాత వీటిని మార్చేయాలి. జిమ్ మ్యాట్ లో సగటున ఒక్కో స్క్వేర్ మీటర్ కు ఓ లక్ష బాక్టీరియా ఉంటుంది. జిమ్ కు మ్యాట్ తీసుకుపోతూ తరుచుగా వాష్ చేస్తూ ఉంటుంది. ఫంగస్ ఇన్ ఫెక్షన్లకు కారణం కాని ప్రత్యేక సాక్స్ ఉపయోగించాలి. సింథటిక్ రకాలు మంచి ఛాయిస్. ఆయితే రెండు పెయిర్లు ట్రయినర్లు తీసుకొంటే వీలుగా ఉంటుంది. వాటిని 24 గంటల పాటు డ్రై చేసే వీలుంటుంది.

Leave a comment