ఈ వేసవి ఎండలకు కీర దోస తింటే శరీరానికి చల్లదనం ఇంకా ఇతర ప్రయోజనాలు ఎన్నొ దక్కుతాయి. ఇది చర్మాన్ని పరిరక్షించగలుగుతుంది. కీరా లో 90శాతం నీరు ఉండటం వల్ల వేసవి వేడికి శరీరం కొల్పోయినా నీటిని ఎలక్ర్టోలైట్స్ ను భర్తీ చేయగలుగుతుంది. చర్మం ఆరోగ్యంగా తాజాగా ఉంటుంది. ఎండకు చర్మం కందిపోయి మంట పెడుతూ ఉంటే కీరా ముక్కతో రుద్దితే పోతుంది. ట్యాన్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. గోళ్ళు చిట్లీ పొకుండా ఉంటాయి. కళ్ళు అసలటతో ఉబ్బినట్లు ఉంటే కీరా దోస పల్చని ముక్కలుగా కోసి ఫ్రిజ్ లో ఉంచి ఆ చల్లని ముక్కలను కాటన్ వేసి పెట్టుకొంటే మంచి ఫలితం ఉంటుంది. కీరా దోస తోక్కలో విటమిన్ కె సమృద్దిగా ఉంటుంది. దీన్ని తోక్కతో పాటు తింటే మంచిది.

Leave a comment