చక్కగా మామిడి పళ్ళు వచ్చేశాయి. వీటిని ఇష్టపడని వారు దాదాపు ఉండరు. రోగ నిరోధక శక్తి వ్యవస్థ పటిష్టంగా ఉంచేందుకు శరీరం ఇనుము శోషించుకొనేందుకు చర్మ సౌందర్యానికి అవసరమైన విటమిన్ సి మామిడి పండులో అధికంగా ఉంటుంది. రొగాలను ఎదుర్కోనే శక్తి ఇచ్చే విటమిన్ ఎ ఫోలేట్ విటమిన్ బి6 కూడా మామిడి పండు లో ఎక్కువే. మామిడి పండులోని ఫైబర్ జీర్ణవ్యవస్థను కాపాడుతుంది. కాకాపోతే జ్యూస్ లు,జామ్ లాగా తీసుకొంటే ఈ రసంలోకి చేరే అదనపు చక్కెరల వల్ల పోషకాలు తక్కువగా కేలరీలు ఎక్కువగా చేరి బరువు పెరిగే ప్రమాదం ఉంది. మధుమేహం ఉన్నవారు రోజుకు పండు తినవచ్చు. ఏదైనా మితంగా ఉంటేనే ఆరోగ్యం కదా!.

Leave a comment