స్టార్ డామ్ అన్నది ఊరికే రాదు ప్రతిభ అదృష్టము రెండు ఉండాలి అంటుంది అతియా శెట్టి. బాలీవుడ్ ప్రముఖ హీరో సునీల్ శెట్టి కూతురు అతియా. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం ఆసక్తిని బట్టే న్యూయర్క్ ఫిల్మ్ అకాడమీ లో చదివాను మొదటి చిత్రం హీరో సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్. ఇక ఆ తర్వాత సినిమాలే. మా నాన్న పేరున్న హీరోనే. అయితే ఆ రిఫరెన్స్ పిల్లలకు సరిపోదు. మనల్ని మనం ప్రూవ్ చేసుకోకపోతే ఎవళ్ళు పట్టించుకోరు. సక్సెస్ మాత్రమే ఇక్కడ మాట్లాడుతుంది అంటుంది అతియా. చిన్నప్పటి నుంచి ఐశ్వర్యారాయ్, కాజల్ అంటే ఇష్టం. వాళ్ళ గ్రేస్ ఎవరికీ రాదు. వాళ్ళను తలచుకుంటూనే పెరిగాను. నాకే కాదు ఎవరికైనా సినిమా ఫ్యాషన్ అయినా సరే, ప్రతిభ ఒక్కటే ఇక్కడ మనల్ని నిలబెడుతుంది అంటుంది అతియా.

Leave a comment