సినిమాటోగ్రఫీ చాలా కష్టమైన పని. రాత్రి పగలు ఎండ వాన ఎలాంటి పరిస్థితిలో ఏ ప్రదేశంలో అయినా పని చేయాలి అందుకే నేమో ఇక్కడ మహిళలు తక్కువ నేను అన్నింటికీ సిద్ధం అయ్యే ఈ రంగంలోకి వచ్చాను అంటుంది సినిమాటోగ్రాఫర్ యామిని యజ్ఞమూర్తి. ఆమె పని చేసిన చిన్న సినిమా ఈ మధ్యనే విడుదల అయింది. కీర్తి సురేష్, సెల్వ రాఘవన్ నటించిన ఈ సినిమాలో కథకు సంబంధించి హ్యాండ్ హోల్డ్ కెమెరా తోనే పని చేయాలి. 15 కేజీల బరువుండే కెమెరాను నడుముకు కట్టుకొని పని చేయాలి. అందుకు నన్ను సిద్ధం చేసుకున్నాను కష్టపడి పని చేసాము అంటుంది యామినీ యజ్ఞమూర్తి. ఈ రంగం లోకి అడుగు పెట్టాలనుకునే అమ్మాయిలకు కెమెరా రంగం గురించి ఎవరైనా కలలు కనొచ్చు కష్టమైన పని అని ఎవరైనా చెపితే అస్సలు వినొద్దు. మనసు చెప్పిన మాటే వినండి అంటుంది యామిని యజ్ఞ మూర్తి .

Leave a comment