ఏదైనా తీపి వంటకం చేస్తూ ఉంటె కొన్ని చిట్కాలు దృష్టిలో ఉంచుకోవచ్చు . బియ్యం లేదా సగ్గుబియ్యం పాయసం చేస్తూ ఉంటె వాటిని పాలలో ఉడికించాక పంచదార గానీ బెల్లం గానీ వేయాలి . రవ్వ హల్వా చేస్తుంటే రవ్వను నేతిలో ముందుగానే వేయించాలి . తరువాతనే నీళ్లు పాలలో ఉడికించి పంచదార కలపాలి . పండ్ల హల్వాలో చక్కెర కాస్త తక్కువే కలపాలి ,వాటిలో సహజంగా తీపి ఉంటుంది . గులాబ్ జామ్ పిండి నాణ్యత ముందే చూసుకోవాలి ,తీపివంటలకు నెయ్యి మాత్రమే వాడాలి అప్పుడే రుచి బావుంటుంది . కస్టర్డ్ వాడాలంటే దాన్ని ముందుగానే కప్పులో కొన్ని పాలలో గడ్డలు కట్టకుండా కలిపి ,అప్పుడు వేడి పాలలో వేస్తే ఉండలు కట్టకుండా ఉంటుంది  బ్రౌన్ షుగర్ లేకపోతే పంచదార గ్రైండ్ చేసి ఉపయోగించవచ్చు .

Leave a comment