ఫోర్బ్స్ సెల్ఫ్ మేడే విమెన్ 2020 జాబితాలో సుప్రీంకోర్టు న్యాయవాది కరుణ నుండి పేరు చోటు చేసుకుంది. టైమ్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత సృజనశీలురా జాబితా చూస్తే ఆ వంద మందిలో మన దేశం నుంచి ఎంపికైన ఏకైక మహిళా కరుణ నుండి భోపాల్ కు చెందిన కరుణ ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తిచేసి కొన్నాళ్లు పాత్ర దేయురాలుగా పనిచేశారు. కొలంబియా యూనివర్సిటీ నుంచి ఎల్.ఎల్ ఎం పూర్తి చేశారు. 2012లో నిర్భయ సంఘటన తర్వాత మానభంగ నిరోధక చట్టం తీసుకురావటంతో ఈమె ప్రధాన పాత్ర వహించారు. మానసిక వికలాంగుల హక్కులు, అంతర్జాతీయంగా లింగ సమానత్వం మరియు హక్కుల పైన పనిచేసే కరుణ నుండి ని వేగంగా ఎదుగుతున్న మహిళా నాయకురాలుగా ఎకనామిక్ టైమ్స్ పేర్కొన్నది.

Leave a comment