Categories
రంగు రాళ్ళలో ఎన్నో వింతలు ,వజ్రాలు,రత్నాలు,మెరిసి పోతాయి కానీ ఆస్ట్రేలియాలో దోరికే ఓపత్ రత్నాలు మాత్రం చిత్ర విచిత్రమైన రంగుల్ని నింపుకొని మరీ మెరిసిపోతాయి.తెలుపు ,ఎరుపు,ఆకుపచ్చ,నీలం,గులాబీ,గోధుమ,నలుపు అన్నీ రంగుల్లో ఈ రాళ్ళు అత్యంత పారదర్శకంగా ,ప్రకృతి వింతల్లా ఇముడ్చుకొని మరీ అద్భుతంగా కనిపిస్తాయి. ఈ రత్నాలను అలాగే నగల్లో పొదగటం కానీ, కత్తిరించి వాడటం కానీ చేస్తారు. జ్యోతిష్య నిపుణులు ఈ రాళ్ళని ధరించటం అదృష్టం అంటారు .చక్కని రంగుల్లో మెరిసే ఈ రాళ్ళను ఉంగరాలు,లాకెట్లు,చెవి రింగుల్లనూ ధరించేందుకు ఇష్టపడుతారు .వజ్రాల్లాగా వీటి ధర ఎక్కువే.