Categories
చన్నీళ్ళ స్నానం ఆరోగ్యం అంటారు ఎక్స్ పర్ట్స్. చల్లని నీళ్ళతో స్నానం శరీరం చల్లబడుతుంది. మళ్ళీ శరీరం వెచ్చగా అయ్యేందుకు కొన్నీ కాలరీలు ఖర్చు అవుతాయి. శరీరంలోని కొవ్వు కరిగి శరీరం వెడెక్కుంతుంది. చన్నీటి స్నానం వల్ల ఏడాదికి నాలుగు కిలోలు బరువు తగ్గుతారట. పాశ్చాత్యా దేశాల్లో బరువు తగ్గేందుకు ఐస్ బాత్ చేస్తారట .చన్నీళ్ళు శరీరంలోని రక్త నాళాలను ప్రభావితం చేస్తాయి అవి సంకోచ,వ్యాకోచాలకు గురవుతాయి. ఈ ప్రక్రియ లో శరీరంలో పేరుకొన్న టాక్సిన్లు రసాయనాలు బయటకి పోతాయి. జిడ్డు చర్మం ఉన్న పొడి చర్మం ఉన్నా చన్నీటి స్నానం మంచిదే.