Categories
నీళ్ళే కదా అని ఎలాపడితే అలా తాగకూడదు అంటున్నారు డాక్టర్స్. తాగేందుకు పద్ధతులు ఉన్నాయి. ఒకే సారీ నోట్లో ఎత్తి పోసుకొని తాగకూడదు. కొద్దీ కొద్దీగా తాగుతూ మధ్యలో శ్వాస తీసుకోవాలి. నెమ్మదిగా కూర్చోని తాగాలి. నిలబడి ,నడుస్తూ హాడవుడిగా తాగవద్దు. నిద్ర లేవగానే గోరు వెచ్చని నీళ్ళు తాగాలి కొంత మంది ఎప్పుడు చల్లని ఫ్రిజ్ నీళ్ళే తాగు తారు అవి ఆరోగ్యానికి హాని చేస్తాయి తప్ప మేలు చేయవు .అతి శీతలమైన పానీయాలు తాగితే ఎలాంటి నష్టమో ఇలా చల్లని నీళ్ళే తాగుతుంటే కూడా దాదాపు అంత నష్టమే. ఏదైనా సహజంగా ఉండాలి.