Categories
ఒక్క సారి అన్ని మంచి పరిశోధన ఫలితాలు తెలుస్తాయి. ఇప్పుడోచ్చిన తాజా పరిశోధన దంతాల పరిశుభ్రత కేవలం వాటి ఆరోగ్యానికి మాత్రం పరిమితం కాదంటుంది. దంతాలలో చేరిన సూక్ష్మజీవులు రక్త ప్రవాహంలో మెదడు కి చేరి మెదడు కణాలను దెబ్బతీస్తాయట. కాబట్టి మెదడును రక్షించుకోవాలంటే దంతాలు జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఇది వరకు వాటి ప్రభావం గుండెమీద ఉంటుందని చెప్పారు. ఇప్పుడు వయసు మళ్ళాక జ్ణాపక శక్తి తగ్గటానికి పళ్ళ శుభ్రత పాటించకపోవడమే కారణం అంటున్నారు. దంతాలు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే దంతాల పైన చేరిన సుక్ష్మజీవుల ప్రభావం మెదడు కణాలను దెబ్బతీసి జ్ణాపకశక్తి పొగోడతాయని కొత్త అధ్యాయనాలు చెపుతున్నాయి.