
పండగకు తనకు తల్లికే కొత్త బట్టలు కొనేందుకు వెళ్ళిన ఉదయ్ కుమార్ ను పోలీస్ లు దొంగతనం కేసులో అనుమానం తో అరెస్ట్ ,అతను కష్టపడి సంపాదించిన డబ్బు దొంగసొమ్మేనని ఆరోపించి తిరిగబడిన ఉదయ్ కుమార్ ని కొట్టి చంపేశారు .అతని తల్లి పద్మవతమ్మ కేరళలోని తిరువనంతపురంలో నివసిస్తుంది.బట్టలు తెచ్చెందుకు వెళ్ళిన కొడుకు శవమై తిరిగొచ్చాడు. పద్మవతమ్మ ఏడ్చి ఉరుకోలేదు. పోలీసులు కె.జితాకుమార్ .ఎస్వీ శ్రీ కుమార్ పైన కేస్ పెట్టింది. 13 సంవత్సరాల పాటు కోర్టుల చుట్టు తిరిగింది. సాక్షులు ఎదురుతిరిగారు ,పోలీసులే కొట్టారు ,అయినా పద్మవతమ్మ కొడుకు మరణానికి సమాధానం కావాలనుకొన్నది. 2005లో మొదలు పెట్టిన అ పోరాటం 2018లో న్యాయం అందటంతో ముగిసింది.ఇద్దరు పోలీసులకు మరణశిక్ష విధించారు పద్మవతమ్మ కన్నీళ్ళు తుడుచుకొంది.