బాడి షేమింగ్ గురించి ప్రస్తావన వస్తే మనిషి స్వరూపం గురించి ప్రసక్తి ఎందుకు వ్యక్తుల్లో ప్రతిభ ముఖ్యం.దాన్ని పక్కన బెట్టి రంగు,ఎత్తు,లావు వీటి గురించి మాట్లాడటం ఎంతో దారుణం అంటుంది సోనాక్షి సిన్హా.నన్ను ఇతరులతో పోల్చి చాలా మంది చాలా కామెంట్లు చేస్తూ ఉంటారు నేనసలు పట్టించుకోను చిన్నప్పుడు ఎంతో బొద్దుగా ఉండేదాన్ని. అయితే ఆ ఆకారం గురించి పట్టింపే లేదు.కానీ ఎంత మంది ఎన్నో సలహాలతో నన్ను విసిగించేవారు.నేను ఎంత బరువు తగ్గాలో తగ్గితే ఎలా ఉండాలో ఇవే విషయాలు కాని నా గురించి నేనే ఆలోచించుకుని సినిమాల్లోకి వద్దామని నిర్ణయించుకున్నాక నా కోసం నేనే బరువు తగ్గాను. అంతే ఇతరుల సలహాలు పాటించి మాత్రం కాదు అంటుంది సోనాక్షి సిన్హా.ప్రస్తుతం కళంక్ సినిమాలో నటిస్తుంది ఆమె.