నీళ్ళు తాగడం వల్ల వచ్చే ఉపయోగాలు సాధారణంగా అందరం చెప్పుకుంటాం. కానీ ఈ నీరు గోరు వెచ్చగా చల్లగా స్నానం చేస్తే కూడా శరీరానికి శక్తి వస్తుందని డాక్టర్లు చెప్పుతున్నారు. నీటికి ఎంతో శక్తి వుంది. మనిషి తేటగా శుభ్రంగా కనిపించడానికే కాదు శరీరం పైన దాడి చేసే సుక్ష్మ జీవుల నుంచి శరీరానికి రక్ష స్నానమే. పరిమళ భరితమైన నూనె వాడి స్నానం చేయాలి అంటారు. మనకు కనిపించే చర్మపు పై పోర మృతకణ జాలం తో కుడి వుంటుంది. నిరంతరం మురికి పోరా ఏర్పడుతూనే వుంటుంది. శుబ్రం చేస్తుంటే మళ్ళి వచ్చి ఏర్పడుతూనే వుంటుంది. అలాగే చర్మం కింద గల గ్రంధాలు కొవ్వు లాంటి మిశ్రమాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది శరీరం పైన పొరలా ఏర్పడుతుంది. దీని పైన హాని లేనివి, హాని కలిగించే బాక్టిరియ ఏర్పడుతుంది. అలగే చర్మం పైన ఏర్పడే పోర కూడా కొన్ని రకాల బాక్టిరియ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఈ పొరలు ఎప్పటి కప్పుడు వదిలించు కునేందుకు స్నానం చాలా అవసరం. మంచి షాంపూ శరీరానికి హాని చేయని సబ్బులు వాడుతూ, వేడి నీళ్ళతో షవర్ బాత్ చేసాక చివరలో చల్ల నీళ్ళు గుమ్మరించుకుంటే ఇంద్రియాలన్నీ జాగృతం అవుతాయి. శరీరంలో రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. ముఖ్యంగా ఈ చలి రోజుల్లో పరిమళ భరితమైన సుగంధపు స్నానం తో శరీరం ఉత్సాహం తెచ్చుకుంటుంది.

Leave a comment