పసిబిడ్డల పై కూడా లైంగిక వేధింపులు సాగుతున్నాయి. వాళ్ళను స్కూళ్ళకు తీసుకుపోయే వాహన డ్రైవర్ల నుంచి ఇంట్లో సన్నిహితంగా మెళిగే బందువుల వరకు ఎవరైనా పిల్లల పై అత్యచార యత్నం చేయవచ్చు లేదా ఇబ్బంది పెట్టవచ్చు. ఈ విషయంలో తల్లిదండ్రులు ముందే హెచ్చరికతో ఉండాలని చెబుతున్నారు ఎక్స్ పర్ట్స్. పిల్లలను ఇబ్బంది పెట్టే నిందితులను శిక్షించేందుకు ప్రత్యేకంగా ప్రొటక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ ( పోస్కో 2012) అందుబాటులోకి వచ్చింది. దీని ప్రకారం పిల్లల్ను లైంగికంగా వేధిస్తే ఆ వ్యక్తికి జీవితకాలం శిక్షపడే అవకాశం ఉంటుంది. అందుకే పిల్లలను శ్రద్దగా బద్రంగా ఉండేలా చూసుకోవాలి. వాళ్ళకు గుడ్ టచ్,బ్యాడ్ టచ్ గురించి తెలపాని చెబుతున్నారు.చట్టపరంగా కూడా పిల్లల్లో భయం పోగొట్టేంద్కు ఫిర్యాదు ఇచ్చిన సందర్భంలో వాళ్ళతో మాట్లాడేందుకు స్టేట్ మెంట్ తీసుకునేటపుడు పిల్ల్లలు భయపడకుండా సాధరణ దుస్తుల్లో ఉండి స్నేహితుల్లా మాట్లాడమని చట్టం స్పష్టంగా చెబుతుంది.

Leave a comment