ఆసియా క్రీడల్లో స్వర్ణం రాకపోయినా రజత పతకం సాధించినందుకు నా మాటకు నాకు ఆనందంగానే ఉంది అంటుంది ప్రముఖ బ్యాడ్మింటన్ క్రిడాకారిణీ పీవీ సింధు. ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఫైనల్ లో ఓడిపోవడం పట్ల అసహనం వ్యక్తం చేసిన వారి గురించి మాట్లాడుతూ అసలా ఫైనల్ వరకూ రావడం ఎంతకష్టమో ఆలోచించమని కోరింది. ఏ క్రీడాకారిణి అయినా ఆడిన ప్రతిమ్యాచ్ లో గెలవడం సాధ్యం కాదు అని అంది. ఈసారి ఇంకా ఎక్కువ సాధన చేసి స్వర్ణం సాధిస్తా అని ధీమా వ్యక్తం చేసింది సింధూ, ఏషియన్ గేమ్స్ మహిళల సింగిల్స్ లో ఫైనల్ కు చేరిన తొలి భారతీయ క్రిడాకారిణిగా ఇప్పటికే మరో చరిత్ర సృష్టించింది.

Leave a comment