2020లో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వంద మంది శక్తిమంతమైన మహిళల బి బి సి జాబితాలో నదీన్ ఒకరు. ఈజిప్ట్ రాజధాని కైరో లో ఉంటుంది నదీన్ అష్రాఫ్ ఫిలాసఫీ లో మాస్టర్స్ చేసింది. తల్లి పౌష్టికాహార వైద్యురాలు తండ్రి  సాఫ్ట్ వేర్. పదకొండు సంవత్సరాల వయసులో ఆమెను వెనక నుంచి తాకి కొట్టి మాయమైపోయిన అతనెవరో ఆమెకు తెలియదు కానీ అలాంటి స్పర్ష ఆమెను వెంటాడి వేధించింది. 2017 అమెరికాలో రగిలిన మీ టూ ఉద్యమ జ్వాల నదీన్ ను తాకింది. ఈజిప్ట్ నుంచి ఇంస్టాగ్రామ్ అకౌంట్ ప్రారంభించింది నదీన్. అహ్మద్ బాస్సమ్ అనే వ్యక్తి లైంగికంగా ఎంతోమందిని బెదిరించి కేసులో ప్రధాన నిందితుడిగా అతను ఎంత మందిని ఎలా వేధించాడో బయటకు తీసింది నదీన్. ఆమె ఇంస్టాగ్రామ్ పేజీ ద్వారానే ఇదంతా సాధ్యమైంది. అతని అరెస్ట్ తో నదీన్ మీ టూ ఉద్యమకారిణి గా గుర్తింపు పొందింది.

Leave a comment