Categories
WhatsApp

డిన్నర్ హెవీగానే వుండాలి.

రాత్రి పుట మంచి ఆహారం తీసుకోవడం చాలా మందికి ఇష్టం వుండదు. డాక్టర్లు కూడా రాత్రి వేళల్లో భారీ భోజనం వద్దు అనే అంటారు. కానీ రాత్రి పుట మనం తినే భోజనం మన శరీర స్తితి పైన ప్రత్యేకంగా కొవ్వును కోల్పోవడం పైన అత్యధిక ప్రభావం కలిగి వుంటుంది. మనం రాత్రి 11 గంటలకు నిద్ర పోయి ఉదయం ఏడు గంటలకు నిద్ర లేస్తే, అంటే దాదాపు 10 గంటల పాటు శరీరానికి ఏదీ అందదన్న మాటేగా మరి అలాంటప్పుడు రాత్రి వేళ తినే ఆహారం సరిగ్గా లేక పొతే శరీరక ఆరోగ్యానికి పెద్ద ముప్పు తెచ్చినట్టే నిద్ర పోయే సమయంలోనే మన శరీరంలోని అలసిన కండరాళ్ళకు  విశ్రాంతి. మెదడుకు ఉత్తేజం తెచ్చుకునే సమయం ఇంద్రియాలకు విశ్రాంతి కావాలి. అలా జరగాలంటే రాత్రి వేళ శరీరంలో పోషకాలు కరిగిపోకుండా చూసుకోవాలి. రాత్రి భోజనంలో ప్రోటీన్లు కొవ్వు కలసిన కార్బోహైడ్రేడ్స్, సలాడ్స్, కుర్ల రూపంలో తీసుకోవాలి. రాత్రి వేళల్లో తినే ఆహారం ఆరోగ్యం ఇచ్చేదిగా వుండాలి.

Leave a comment