భూమి లోపల ఒక అద్భుతాన్ని కనుక్కొన్నారు. గ్యాంకీ ప్రాంతంలో భూగర్భ శాస్త్రవేత్తలు పరిశోధనల్లో ఒక పెద్ద సింక్ హోల్ బయటపడింది. పర్వతాల మధ్యన ఉన్నా ఈ సింక్ హోల్ 630 అడుగుల లోతులో ఉంది. లోపల అంతా ప్రాచీన వాతావరణం నెలకొని ఉంది. అక్కడ వృక్షాలు కొన్ని 130 అడుగుల పొడవున ఉన్నాయి. ఇక్కడ వృక్ష జంతుజాలం పై మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు చైనీయులు. వీటికి హెవెన్లీ పిట్స్ అనే పేరు పెట్టారు. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో పర్యాటకులు ట్రెక్కింగ్ చేస్తున్నారు.

Leave a comment