ఒక సెల్ ఫోన్ జెస్సీ జీవితాన్ని ఎలా అతలాకుతలం చేసింది అనేదే ఈ సినిమా కథ కుటుంబ పోషణ కోసం తల్లి మిషన్ కొడుతూ ఉంటుంది.ఇంటర్ తప్పి ఇంట్లోనే ఉంటూ తల్లికి కుట్టు మిషన్ పనుల్లో సాయం చేస్తూ ఉంటుంది జెస్సీ. ఒకరోజు ఈ పనిలో భాగంగా ఒక కస్టమర్ కి ఫోన్ చేస్తే అది కాస్తా పొరపాటున విష్ణు అనే  ఆటో నడిపే వ్యక్తి కి వెళ్తుంది.  అలా పరిచయమైన ఇద్దరు ఆ ఫోన్ లో మాట్లాడు కుంటూ ప్రేమించుకుంటారు. తల్లిదండ్రులు ఆమెకు బెన్నీ అనే దుకాణదారు తో పెళ్లి నిశ్చయిస్తారు. ఈ విషయం చెప్పి  విష్ణుని కలుసుకునేందుకు బస్సులో కోజికోడ్ కు బయలు దేరింది  జెర్సీ. బస్ స్టాండ్ లో ఒక తోపులాటలో విష్ణు ఫోన్ కాస్తా పోతుంది.జెస్సీ కోజికోడ్ లో ఇరుక్కు పోతుంది. ఎంతో కష్టం మీద ఇద్దరు కలుసుకుంటారు. స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ లు వచ్చాక  ఎంతోమంది అమ్మాయిలు మోసగాళ్ళ ట్రాప్ లో ఇరుక్కుంటున్నారు. ఇలా ప్రాణాలు తీసుకునే సందర్భాలు వస్తాయో దర్శకుడు మహమ్మద్ ముస్తఫా  ముస్తఫా చక్కగా సినిమా తీశాడు.జెస్సీ ఎట్లా బయటపడి ఇల్లు చేరుకుందో, విష్ణు ని ఎలా పెళ్లాడిందో సినిమా చూడండి మంచి సినిమా నెట్ ఫ్లెక్స్ లో సబ్ టైటిల్స్ లో ఉంది.
రవిచంద్ర. సి  
7093440630 

Leave a comment