క్రికెట్ మ్యాచ్ మొదలయింది అంటే ప్రతి నిమిషం టెన్షన్. ఇక సోషల్ మీడిమా కామెంట్స్ ఆరోగ్యంగా ఉండే మనిషి కూడా సిక్ అయోపోయేలాగా ఉంటాయి. ఒక గర్భిణికి అవసరంలేని కామెంట్స్ అవి, అందుకే సైన్ అవుట్ అవుతున్నా ఒక్కటైతే గుర్తు పెట్టుకోంది ఇది క్రికెట్ మ్యాచ్ మాత్రమే అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో కనపడకుండా అదృశ్యమైంది సానియామీర్జా.  దుబాయ్ లో ఇండియా, పాకిస్థాన్ మధ్య వన్డే మ్యాచ్ మొదలవ్వకముందే మ్యాచ్ లో ఆడుతున్న షోయాబ్ మాలిక్ భార్య సానియా మీర్జా తన ఎకౌంట్ లో పెట్టిన పోస్ట్ ఇది. ఇప్పుడున్న కండీషన్ లో ఏ సందర్భంలో అయినా సోషల్ మీడియా పోస్టులు రెచ్చగోట్టేలా ఉండటం కుల,వర్గ,మతాలను గురించే పరస్పర దూషణలు కొనసాగుతున్న తరుణంలో సానియా చెప్పిన హితవు ఆలోచించదగ్గదే కదా.

Leave a comment