ముస్లీంలు తక్షణం విడాకులు ఇచ్చేందుకు వీలు కల్పించే త్రిపుల్ తలాక్ పద్దతిని నిషేధిస్తూ కేంద్ర కెబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఇక త్రిపుల్ తలాక్ నిషిద్దం.  ఈ మేరకు తము ఎదుర్కొంటున్న కష్టాలు, వివక్షకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో సవాల్ చేసిన వారంతా ముస్లిం మహిళలే.  ఈ అంశానికి సంబధించి మొత్తం ఏడు పిటీషన్ల పైన ధర్మాసనం విచారించింది.  షయరా బానో, ఇష్రత్ జహన్, ఆఫ్రిన్ రెహ్మాన్, ఫరా ఫైజ్, అతియా సాబ్ర, గుల్షర్ పర్వీన్ లు కోర్టులో పిటూషన్లు దాఖలు చేశారు. ఇప్పుడు తక్షణ ట్రిపుల్ తలాక్ ను భారతదేశంతో సహా 22 దేశాలు నిషేధించాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్,శ్రీలంక, ఆఫ్గానిస్తాన్ కూడా ఈ నిషేధించిన దేశాల్లో ఉన్నాయి.

Leave a comment