ఈస్టర్ ఎగ్ అంటే ఐరోపా అమెరికా దేశాల్లో ఈస్టర్ పండుగ సమయంలో కానుకలుగా ఇచ్చిపుచ్చుకునేందుకు గాను ఎడిబుల్ కలర్స్ తో ఆకర్షణీయంగా తయారు చేసే గుడ్లు. ఈ తరం షేప్స్ రంగురంగుల కూరగాయల తో ప్రయోగాలు చేసినట్లే సహజ రంగులతో గుడ్డును ఆహారపదార్థాల కు అలంకరించేందుకు ఉపయోగిస్తున్నారు.గుడ్డు కు రంగులు తేవటం కోసం పసుపు, బీట్రూట్ క్యారెట్, వంకాయ రంగు, క్యాబేజీ లు, నల్లద్రాక్ష వాడుతున్నారు గుడ్డుకు రంగు రావాలంటే ముందుగా రెండు టీ స్పూన్ల వైట్ వెనిగర్ వేసి నీళ్లు మరిగించి ఏ రంగులో కావాలో ఆ రంగు కూర ముక్కలు వేసి ఉడికించి చల్లార్చాలి. ఆ నీళ్లలో పెంకు తీసిన గుడ్డును ఉంచితే చాలు తెల్లసొనకు రంగులు అంటీ కోరిన రంగు గుడ్లు వచ్చేస్తాయి.పిల్లలకు గుడ్డు తినిపించాలి అంటే ఇదో పద్ధతి కూడా.

Leave a comment